కరోనాతో నాడీ సమస్యలు

ABN , First Publish Date - 2020-07-10T06:27:16+05:30 IST

జ్వరం, దగ్గు వంటివి కరోనా బాధితుల్లో సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ లక్షణాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో కోవిడ్‌-19 బాధితుల్లో మతిమరుపు...

కరోనాతో నాడీ సమస్యలు

లండన్‌, జూలై 9:  జ్వరం, దగ్గు వంటివి కరోనా బాధితుల్లో సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ లక్షణాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో కోవిడ్‌-19 బాధితుల్లో మతిమరుపు,  బ్రెయిన్‌ స్ర్టోక్‌, మెదడు వాపు, వెన్నుపాము, నరాల సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని యూకేలోని లీవర్‌పూల్‌ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇందుకోసం యూకే, చైనా, ఇటలీ, అమెరికాలో ఆస్పత్రిలో చేరిన 1,000 మంది కరోనా రోగులను పరిశీలించారు. వీరిలో చాలా మందిలో మతిమరుపు, బ్రెయిన్‌ స్ర్టోక్‌,  మెదడు వాపు, నాడీ సంబంధిత సమస్యలు కనిపించాయి. ‘‘మెదడు, నాడీ సంబంధిత సమస్యలు చాలా ఆసాధారణమైనవి. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యలతో బాధ పడుతున్న కరోనా రోగులు భారీ సంఖ్యలో ఉంటారు’’అని లీవర్‌పూల్‌ యూనివర్సిటీకి చెందిన సుజన్నా లాంత్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-07-10T06:27:16+05:30 IST