కొత్త మ్యాప్‌కు ఏకగ్రీవ ఆమోదం..

ABN , First Publish Date - 2020-06-18T19:18:42+05:30 IST

కొత్తగా విడుదల చేసిన మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఎగువసభలో ...

కొత్త మ్యాప్‌కు ఏకగ్రీవ ఆమోదం..

ఖాట్మండు: కొత్తగా విడుదల చేసిన మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఎగువసభలో ఉన్న సభ్యులు 57 మంది ఏకగ్రీవంగా ఓటు వేయడంతో ఈ బిల్లు భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. దీంతో కొత్త మ్యాప్‌కు 90 శాతం చట్టబద్ధత లభించినట్లైంది. ఆమోదం పొందిన బిల్లును పార్లమెంట్ రాష్ట్రపతికి పంపిస్తుంది. ఆయన ఆమోదముద్ర వేస్తే అధికారికంగా ఇది అమల్లోకి వస్తుంది. 


ఇదిలా ఉంటే భారత భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధూరా ప్రాంతాలు తమ దేశ సరిహద్దులోకి వస్తాయంటూ నేపాల్ వివాదం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ భూభాగాలపై నేపాల్‌కు ఎటువంటి అధికారం లేదంటూ భారత్ స్పష్టం చేస్తున్నప్పటికీ నేపాల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

Updated Date - 2020-06-18T19:18:42+05:30 IST