బిహార్‌లో కరకట్ట పనులకు నేపాల్ అడ్డుకట్ట
ABN , First Publish Date - 2020-06-23T07:20:56+05:30 IST
ఉత్తరాఖండ్‌లోని లింపియాధురా, కాలాపానీ, లిపులేఖ్ తమవిగా ప్రకటించుకున్న నేపాల్.. బిహార్‌తో సరిహద్దుల్లోని ఒక ప్రాంతంలో కరకట్ట పనులను అడ్డుకుంది. లాల్ బకేయా నదిపై రాష్ట్ర జలవనరుల శాఖ నిర్మించిన...

పట్నా, జూన్ 22: ఉత్తరాఖండ్‌లోని లింపియాధురా, కాలాపానీ, లిపులేఖ్ తమవిగా ప్రకటించుకున్న నేపాల్.. బిహార్‌తో సరిహద్దుల్లోని ఒక ప్రాంతంలో కరకట్ట పనులను అడ్డుకుంది. లాల్ బకేయా నదిపై రాష్ట్ర జలవనరుల శాఖ నిర్మించిన కరకట్టకు మరమ్మతులు చేసేందుకు జూన్ 15న వెళ్లిన సిబ్బందిని నేపాల్ అధికారులు అడ్డుకున్నారు. ‘అది నో మాన్స్ లాండ్ కాబట్టి ఏ పనులూ చేయొద్దు’ అన్నారు.