ఎన్డీయే లక్ష్యం..200సీట్లు: నితీశ్
ABN , First Publish Date - 2020-03-02T08:50:18+05:30 IST
బిహార్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయే కనీసం 200 సీట్లు గెలుచుకునేలా పనిచేయాలని...

బిహార్ అభివృద్ధి కోసం నితీశ్ తపన: ప్రధాని మోదీ
పట్నా/న్యూఢిల్లీ, మార్చి 1: బిహార్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎన్డీయే కనీసం 200 సీట్లు గెలుచుకునేలా పనిచేయాలని జేడీయూ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఆదివారం పట్నాలో నిర్వహించిన జేడీయూ సభలో మాట్లాడుతూ.. బీజేపీతో తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా, నితీశ్‌కుమార్ కిందిస్థాయి నుంచి ఎదిగిన నేత అని, బిహార్ అభివృద్ధి పట్ల తపన ఉన్న నాయకుడని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం నితీశ్ పుట్టినరోజును పురస్కరించుకొని ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘నా స్నేహితుడు నితీశ్‌కుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.