బీహార్ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఎన్సీపీ సై..!
ABN , First Publish Date - 2020-10-08T21:00:21+05:30 IST
త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కూడా పోటీ చేస్తుందని ఎన్‌సీపీ ప్రకటించింది...

ముంబై: త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కూడా పోటీ చేస్తుందని ఎన్‌సీపీ ప్రకటించింది. ఎన్నికల ప్రచారం కోసం 40 మందితో కూడిన స్టార్ క్యాంపైనర్ల జాబితాను కూడా విడుదల చేసింది. బీహార్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కీలక స్టార్ క్యాంపైనర్‌గా ఉంటారని స్పష్టం చేసింది. మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మలిక్, పార్టీ ఎంపీలు ప్రఫుల్ పటేల్, సునిల్ తత్కరే, సుప్రియా సూలే, ఫౌజియా ఖాన్, తదితరులు కూడా స్టార్ క్యాంపైనర్లుగా వ్యవహరించనున్నారు. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈ నెల 28 నుంచి వచ్చే నెల 7 వరకు మొత్తం 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.