సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌కు ఎన్‌సీబీ సమన్లు..!

ABN , First Publish Date - 2020-09-22T00:06:36+05:30 IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం నుంచి దర్యాప్తు జరుపుతున్న..

సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌కు ఎన్‌సీబీ సమన్లు..!

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం నుంచి దర్యాప్తు జరుపుతున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) చిత్రపరిశ్రమతో సంబంధం ఉన్న పలువురిని ప్రశ్నించేందుకు సమన్లు సిద్ధం చేస్తోంది. నటి సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌లకు త్వరలోనే సమన్లు పంపనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టంలోని సెక్షన్ 67 కింద ఈ నోటీసులను పంపనున్నారు. ఫ్యాషన్ డిజైనర్ ఖంబట్టా, మరో నటికి కూడా ఎన్‌సీబీ త్వరలో సమన్లు పంపనున్నట్టు సమాచారం.


సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్‌ ప్రమేయాయానికి సంబంధించి నటి రియా చక్రవర్తిని ఎన్‌సీబీ రెండు వారాల క్రితం అరెస్టు చేసింది. పార్టీల్లో నార్కోటిక్స్ వాడారంటూ పలువురు బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లను ఎన్‌సీబీ విచారణలో రియా చక్రవర్తి వెల్లడించింది. అందుకు అనుగుణంగా ఆయా వ్యక్తులను ప్రశ్నించేందుకు ఎన్‌సీబీ కసరత్తు మొదలుపెట్టింది. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని, డ్రగ్స్ విక్రేతలుగా వ్యవహరించిన ఆరోపణలపై సుశాంత్ సన్నిహితులు ఇద్దరిని ఎన్‌సీబీ ఇప్పటికే అరెస్టు చేసింది. దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌‌ను కనుగొనేందుకు ముంబై, గోవాలోని పలు ప్రాంతాల్లో ఎన్‌సీబీ దాడులు నిర్వహించింది. ముంబైలోని తన నివాసంలో గత జనవరి 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసును సీబీఐ, ఈడీ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి.

Updated Date - 2020-09-22T00:06:36+05:30 IST