బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు మళ్లీ సమన్లు

ABN , First Publish Date - 2020-12-15T20:20:35+05:30 IST

మాదక ద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్రూరో ..

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు మళ్లీ సమన్లు

ముంబై: మాదక ద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్రూరో మరోసారి సమన్లు పంపింది. తదుపరి విచారణం కోసం బుధవారంనాడు తమ ముందు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొంది. ఇదే కేసులో గత నవంబర్ 13న అర్జున్ రాంపాల్‌ను ఎన్‌సీబీ అధికారులు ప్రశించారు. దీనికి ముందు నవంబర్ 9వ ఆయన నివాసంపై ఎన్‌సీబీ దాడులు జరిపి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధనం చేసుకుంది. రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌ను సైతం అదే రోజు సుమరు 6 గంటల సేపు ప్రశ్నించింది. ఈ కేసులో అర్జున్ రాంపాల్ మిత్రుడు పాల్ బార్టెల్‌ను ఎన్‌సీబీ అరెస్టు చేసింది. దీనికి నెల రోజుల ముందు గాబ్రియేలా సోదరుడు అగిసియాలస్‌ను అధికారులు అరెస్టు చేశారు. చిన్న మొత్తంలో అతని నుంచి గంజాయి, అల్రాజోలమ్ ట్లాబ్లెట్లు స్వాధీనం చేశారు.


Read more