యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి, తిరిగి యాక్టివ్ అయిన సిద్దూ

ABN , First Publish Date - 2020-03-15T15:57:51+05:30 IST

చాలా రోజుల పాటు రాజకీయంగా నిశ్శబ్దంగా ఉండిపోయిన కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ మళ్లీ క్రియాశీలకంగా మారిపోయారు

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి, తిరిగి యాక్టివ్ అయిన సిద్దూ

పంజాబ్: చాలా రోజుల పాటు రాజకీయంగా నిశ్శబ్దంగా ఉండిపోయిన కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ మళ్లీ క్రియాశీలకంగా మారిపోయారు. ‘జీతేగా పంజాచాలా రోజుల పాటు రాజకీయంగా నిశ్శబ్దంగా ఉండిపోయిన కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ మళ్లీ క్రియాశీలకంగా మారిపోయారు. ‘జీతేగా పంజాబ్’ పేరుతో  ఓ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. పంజాబ్ ను క్రియాశీలకంగా తిరిగి పునరుజ్జీవింప చేసే  ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మూడేళ్లు పూర్తి చేసుకొని, నాలుగో యేడులోకి అడుగు పెడుతున్న సందర్భంలో సిద్దూ ఈ ఛానల్‌ను లాంఛ్ చేయడం గమనించాల్సిన అంశం. పంజాబ్ ప్రజల అభిమతాన్ని తెలపడానికి ఈ ఛానల్ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పేర్కొంది.


ఈ ఛానల్‌లో అన్ని రకాల అభిప్రాయాలను ప్రసారం చేస్తామని, అంతేకాకుండా అన్ని భావజాలాలకు చెందిన వ్యక్తుల ఇంటర్వ్యూలను కూడా తీసుకుంటామని పార్టీ పేర్కొంది. పునరుజ్జీవం వైపు పంజాబ్ ప్రజలను తిరిగి నడిపించడానికి ఈ ఛానల్ దోహదపడుతుందని నేతలు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సౌభ్రాతృత్వాన్ని, ప్రేమను చాటిన గురునానక్ స్ఫూర్తితోనే దీనిని ప్రారంభిస్తున్నట్లు సిద్దూ పేర్కొన్నారు. ఈ ఛానల్ ద్వారా పంజాబ్ ప్రజలు తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తూ పంజాబ్ పునరుజ్జీవం కోసం పాటుపడాలని సిద్దూ పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-03-15T15:57:51+05:30 IST