వారికి పూర్తి స్ధాయి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు.. సీఎం కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2020-04-21T20:20:08+05:30 IST
భువనేశ్వర్: కరోనా కట్టడికి యత్నిస్తూ విధుల్లో భాగంగా మరణించే వైద్య సిబ్బందికి అమరవీరుల హోదా ఇస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు.

భువనేశ్వర్: కరోనా కట్టడికి యత్నిస్తూ విధుల్లో భాగంగా మరణించే వైద్య సిబ్బందికి అమరవీరుల హోదా ఇస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. అలా మరణించిన సిబ్బందికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. వారి సేవలకు గుర్తింపుగా జాతీయ పండుగల రోజు అవార్డులు బహుకరిస్తామని సీఎం వెల్లడించారు. అంతేకాదు కరోనా కట్టడికి యత్నిస్తోన్న సిబ్బందికి 50 లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ చేయించారు. విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య సిబ్బంది పనులకు అంతరాయం కలిగించే వారిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తామని నవీన్ వార్నింగ్ ఇచ్చారు.
ఒడిశాలో ఇఫ్పటివరకూ 68 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు.