గాంధీ భారతం ఇది... బీజేపీ భారతం కాదు : ఒమర్ అబ్దుల్లా

ABN , First Publish Date - 2020-11-06T22:56:32+05:30 IST

ఆర్టికల్ 370, 35 ఏ రద్దు చేసిన తర్వాత మిగితా ప్రాంతాలతో ప్రజలు కలిసి పోతారని కేంద్రం ప్రకటించిందని

గాంధీ భారతం ఇది... బీజేపీ భారతం కాదు : ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్ : నేషనల్ కాన్ఫరెన్స్ నేతలైన ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా కేంద్రంపై మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్ గనక పాకిస్తాన్ లో కలవాలనుకుంటే 1947 లోనే కలిసిపోయేదని, ఆపే శక్తి అప్పట్లో ఎవరికీ లేదని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కానీ... మన దేశం మహాత్మా గాంధీ భారతమని, బీజేపీ భారతం ఎంత మాత్రమూ కాదని ఫరూక్ మండిపడ్డారు. ఇక ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.ఆర్టికల్ 370, 35 ఏ రద్దు చేసిన తర్వాత మిగితా ప్రాంతాలతో ప్రజలు కలిసి పోతారని కేంద్రం ప్రకటించిందని, కానీ... అంతకంటే ముందే ప్రజలు కలివిడిగా బతికారని పేర్కొన్నారు.


370 రద్దు జరిగిన తర్వాత కూడా అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని ఒమర్ కేంద్రానికి సవాల్ విసిరారు. ప్రభుత్వం చేపట్టే పనులకు సంవత్సరం మీద మూడు నెలలు సరిపోతుంద ని ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో తప్పుడు భాష్యాలు చెప్పకూడదని మొదటి నుంచి తాము మొత్తుకుంటూనే ఉన్నామని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, 35 ఏ రద్దుతో అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని నమ్మబలికారని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్ విషయంలో 370 రద్దు పెద్ద తప్పటడుగని విమర్శించారు. తమ సొంత గడ్డపైనే రక్షణ కరువైందని ఒమర్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-06T22:56:32+05:30 IST