రాష్ట్రపతికి లడక్ అప్‌డేట్స్ ఇచ్చిన మోదీ

ABN , First Publish Date - 2020-07-05T18:47:23+05:30 IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో తన లడక్ పర్యటన వివరాలు ఆయనకు వివరించారు. లడక్ పర్యటనలో

రాష్ట్రపతికి లడక్ అప్‌డేట్స్ ఇచ్చిన మోదీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో తన లడక్ పర్యటన వివరాలు ఆయనకు వివరించారు. లడక్ పర్యటనలో భాగంగా లెఫ్టెనెంట్ జనరల్ హరిందర్ సింగ్‌ ద్వారా తెలుసుకున్న వివరాలను వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న వాస్తవ పరిస్థితులను వివరించారు. లేహ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను కలుసుకున్న విషయంతో పాటు తన పర్యటనలోని అన్ని విశేషాలను రాష్ట్రపతితో పంచుకున్నారు. సైనిక బలగాల సన్నద్ధతను తెలిపారు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా తీసుకుంటున్న కోవిడ్ కట్టడి చర్యలను కూడా వివరించారు.


ప్రధాని, రాష్ట్రపతి జాతీయ, అంతర్జాతీయ విషయాలపై చర్చించారంటూ రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది. Updated Date - 2020-07-05T18:47:23+05:30 IST