నరేంద్ర మోదీ కాదు, ‘‘సరెండ‌ర్’’మోదీ.. ప్రధానిపై రాహుల్ సెటైర్..

ABN , First Publish Date - 2020-06-21T19:22:04+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు...

నరేంద్ర మోదీ కాదు, ‘‘సరెండ‌ర్’’మోదీ.. ప్రధానిపై రాహుల్ సెటైర్..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. భారత భూభాగాన్ని చైనాకి కట్టబెట్టారనీ.. ఆయన ‘‘సరెండర్’’ మోదీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లద్దాక్‌లోని గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణపై ఇటీవల కేంద్రాన్ని నిలదీస్తూ వస్తున్న రాహుల్ ఇవాళ మరోసారి ట్విటర్లో ఈ మేరకు పేర్కొన్నారు. ‘‘నరేంద్ర మోదీ వాస్తవానికి సరెండర్ మోదీ..’’ అంటూ ట్వీట్ చేశారు. జపాన్‌ టైమ్స్ రాసిన ఓ కథనాన్ని సైతం ఆయన తన పోస్టుకు జత చేశారు. చైనా బలగాలు భారత భూభాగంలోకి రాలేదంటూ ప్రధాని మోదీ పేర్కొన్న మరుసటి రోజే రాహుల్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. ఈ నెల 15న తూర్పు లద్దాక్‌లోని గాల్వాన్ లోయలో చైనా పీఎల్ఏ బలగాలతో జరిగిన తీవ్ర ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. Updated Date - 2020-06-21T19:22:04+05:30 IST