ఏపీ అంగన్‌వాడీలకు నందిని పాలు
ABN , First Publish Date - 2020-03-02T14:44:50+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి అంగన్‌వాడీ పిల్లలకు కెఎంఎఫ్‌కు చెందిన నందిని పాలు పంపిణీ చేయడానికి నిర్ణయించింది. ప్రతి నెలా 55 లక్షల లీటర్ల పాలను

- అంగన్‌వాడీలకు సరఫరా చేయనున్న కేఎంఎఫ్
- ప్రతి నెలా 55 లక్షల లీటర్ల సరఫరాకు ఒప్పంద
బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి అంగన్‌వాడీ పిల్లలకు కెఎంఎఫ్‌కు చెందిన నందిని పాలు పంపిణీ చేయడానికి నిర్ణయించింది. ప్రతి నెలా 55 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేసేందుకు కెఎంఎఫ్‌తో ఒప్పందం కుదిరిందని కెఎంఎఫ్ అధ్యక్షులు బాలచంద్ర జార్కిహొళి వెల్లడించారు. నగరంలో బాలచంద్ర జార్కిహొళి మాట్లాడుతూ ప్లెస్లిప్యాక్, టెట్రాప్యాక్‌లలో పాలు సరఫరా చేస్తామన్నారు. ఆదివారం నుంచే పాలసరఫరా ప్రారంభమైందన్నారు. కాగా నందిని పాల కొనుగోలుకు తెలంగాణ, కేరళ ప్రభుత్వాలు కూడా ఆసక్తి చూపుతుండడంతో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలిపారు.
