నాందేడ్‌లో సాధువును హత్య చేసిన హంతకుడిని పట్టుకున్న తెలంగాణ పోలీసులు
ABN , First Publish Date - 2020-05-24T22:55:11+05:30 IST
ముంబై: మహారాష్ట్ర నాందేడ్ ఆశ్రమంలో శివాచార్య అనే సాధువుతో పాటు భగవాన్ షిండే అనే మరో వ్యక్తిని హత్య చేసిన హంతకుడిని తెలంగాణ

ముంబై: మహారాష్ట్ర నాందేడ్ ఆశ్రమంలో శివాచార్య అనే సాధువుతో పాటు భగవాన్ షిండే అనే మరో వ్యక్తిని హత్య చేసిన హంతకుడిని తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా తానూరులో హంతకుడు సాయినాథ్ శింఘడేను పట్టుకుని విచారణ తర్వాత మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు. డబ్బు, బంగారం కోసం హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో హంతకుడు అంగీకరించాడని సమాచారం.
నాందేడ్ ఆశ్రమంలో స్వామి శివాచార్యతో పాటు భగవాన్ షిండే మృత దేహాలు స్నానాల గదిలో పడి ఉన్నాయి. ఇద్దరినీ గొంతుకోసి హత్యచేశారు. డబ్బు, బంగారంతో పాటు మృత దేహాన్ని కూడా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లే క్రమంలో స్థానికులు అడ్డుకున్నారు. అక్కడ నుంచి పరారైన హంతకుడు నిర్మల్ జిల్లా తానూరుకు చేరుకున్నాడు. మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తం చేయడంతో సత్వరమే స్పందించిన ఎస్‌ఐ రాజన్న తన బృందంతో కలిసి గాలింపు జరిపారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు. హత్య జరిగిన గంటల్లోనే తెలంగాణ పోలీసుల సహకారంతో కేసు ఓ కొలిక్కి వచ్చినట్లైంది.