నమస్తే పెట్టి.. నగలతో ఉడాయిస్తాడు
ABN , First Publish Date - 2020-10-28T07:59:08+05:30 IST
వృద్ధులే అతడి టార్గెట్.. చేతులు జోడించి వినమ్రంగా నమస్తే పెడతాడు.. వినయంతో పాదాభివందనం చేస్తాడు.. తనను తాను నగల వ్యాపారిగా పరిచయం చేసుకుంటాడు...

- ఢిల్లీలో ‘నమస్తే గ్యాంగ్’ లీడర్‌కు బేడీలు
న్యూఢిల్లీ, అక్టోబరు 27: వృద్ధులే అతడి టార్గెట్.. చేతులు జోడించి వినమ్రంగా నమస్తే పెడతాడు.. వినయంతో పాదాభివందనం చేస్తాడు.. తనను తాను నగల వ్యాపారిగా పరిచయం చేసుకుంటాడు.. ఆ తర్వాత.. నయానో, భయానో వారి దగ్గర నుంచి నగలు తీసుకుని ఉడాయిస్తాడు.. మూడేళ్లుగా ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లో 100కు పైగా చోరీలకు పాల్పడ్డ నమస్తే గ్యాంగ్ లీడర్ చాంద్ మహమ్మద్‌ను ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ నెల 17న 70 ఏళ్ల ఓ వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.