తాగుబోతు భర్తతో వేగలేని ఆమె ఏం చేసిందంటే...

ABN , First Publish Date - 2020-10-13T15:18:00+05:30 IST

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒక భార్య రూ. 50 వేల రూపాయలకు సుపారీ కుదుర్చుకుని, భర్తను అత్యంత దారుణంగా హత్యచేయించింది. 35 ఏళ్ల ఆ మహిళ నాగపూర్‌లోని ఇద్దరు కిరాయి హంతకుల సాయంతో ఈ దారుణానికి పాల్పడింది.

తాగుబోతు భర్తతో వేగలేని ఆమె ఏం చేసిందంటే...

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఒక భార్య రూ. 50 వేల రూపాయలకు సుపారీ కుదుర్చుకుని, భర్తను అత్యంత దారుణంగా హత్యచేయించింది. 35 ఏళ్ల ఆ మహిళ నాగపూర్‌లోని ఇద్దరు కిరాయి హంతకుల సాయంతో ఈ దారుణానికి పాల్పడింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ మహిళ తన భర్తను హత్యచేసిన చందన్ నథూజీ దివెవార్, సునీల్ మాలవీయ్‌లకు రూ. 50 వేలు ఇచ్చింది. ఈ కేసును ఛేధించిన పోలీసులు చందన్‌ను పట్టుకున్నారు. పరారైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఆ కిరాయి హంతకులు ఆమె భర్త జయదీప్ గొంతుకు ఉచ్చు బిగించి హత్య చేశారు. ఈ కేసులో పోలీసులకు ఆ మహిళపై అనుమానం కలిగి ఆమెను విచారించగా, అసలు విషయం వెలుగు చూసింది. అలాగే ఆ కిరాయి హంతకుల పేర్లు కూడా పోలీసులకు తెలియజేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-10-13T15:18:00+05:30 IST