పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానున్న నడ్డా

ABN , First Publish Date - 2020-02-12T21:01:32+05:30 IST

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం సాయంత్రం కీలక భేటీ నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాల్లో ఏఏ

పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానున్న నడ్డా

న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం సాయంత్రం కీలక భేటీ నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాల్లో ఏఏ అంశాలు చర్చించనున్నారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. అయితే ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలుకావడం, ఆప్ ఘన విజయం సాధించడం లాంటి విషయాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు ప్రచారంలో పాల్గొన్నా సరే... ఎక్కడ ఇబ్బంది పడ్డారో ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. వీటితో పాటు మరికొన్ని రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలపై కూడా వీరు చర్చించనున్నారు. 

Updated Date - 2020-02-12T21:01:32+05:30 IST