ఎలక్ట్రిక్ కుక్కర్‌తో ఎన్95 మాస్క్‌ల శానిటైజేషన్
ABN , First Publish Date - 2020-08-11T07:45:31+05:30 IST
ఎలక్ట్రిక్ కుక్కర్ వంటలు వండేందుకే కాదు.. ఎన్95 మాస్క్‌లను శానిటైజ్ చేయడానికీ పనికొస్తుందని అమెరికాలోని ఇలినాయిస్ అర్బానా-చాంపైన్ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు...

వాషింగ్టన్, ఆగస్టు 10: ఎలక్ట్రిక్ కుక్కర్ వంటలు వండేందుకే కాదు.. ఎన్95 మాస్క్‌లను శానిటైజ్ చేయడానికీ పనికొస్తుందని అమెరికాలోని ఇలినాయిస్ అర్బానా-చాంపైన్ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇందులో మాస్క్‌ను ఉంచి దాదాపు 100 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత వద్ద 50 నిమిషాల పాటు వేడిచేస్తే క్రిమిరహితంగా తయారవుతుందని తెలిపారు. ఈ క్రమంలో కుక్కర్ అడుగుభాగంలో చిన్నపాటి టవల్‌ను ఉంచాలని, దీంతో ఈ ప్రక్రియ జరుగుతుండగా మాస్క్‌ను నేరుగా కుక్కర్ వేడి తాకకుండా ఉంటుందన్నారు. ఇలా 20సార్లు శానిటైజ్ చేసిన తర్వాత కూడా మాస్క్‌ల పనితీరు ఏ మాత్రం సన్నగిల్లలేదని అధ్యయనంలో తేలినట్లు వెల్లడించారు.