కరోనా నుంచి ట్రంప్ త్వరగా కోలుకోవాలి: కిమ్

ABN , First Publish Date - 2020-10-04T23:04:49+05:30 IST

కరోనా నుంచి ట్రంప్ త్వరగా కోలుకోవాలి: కిమ్

కరోనా నుంచి ట్రంప్ త్వరగా కోలుకోవాలి: కిమ్

సియోల్: కోవిడ్-19 నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని భార్య మెలానియా ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ఆకాంక్షించారు. డొనాల్డ్ ట్రంప్‌కు కిమ్ జోంగ్ ఉన్ తన సానుభూతి సందేశాన్ని పంపారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, కరోనా వైరస్ నుంచి త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్లు కిమ్ తెలిపారు. ట్రంప్, అతని భార్యకు కిమ్ తన సానుభూతి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నుంచి ట్రంప్ ఖచ్చితంగా అధిగమిస్తారని ఆకాంక్షించారు.

Updated Date - 2020-10-04T23:04:49+05:30 IST