మైసూరులో ఫార్మా కలకలం

ABN , First Publish Date - 2020-04-12T07:57:05+05:30 IST

కర్ణాటకలో కరోనా వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య 215. అందులో మైసూరు జిల్లా నుంచే 47 కేసులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా కేసులు...

మైసూరులో ఫార్మా కలకలం

20 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌


బెంగళూరు, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి):
కర్ణాటకలో కరోనా వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య 215. అందులో మైసూరు జిల్లా నుంచే 47 కేసులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా కేసులు కల్లహళ్లిలోని జుబిలియంట్‌ ఫార్మా కంపెనీకి చెందినవే. కర్ణాటకలో ఈ కంపెనీ ఇప్పుడు కరోనా వైర్‌సకు కేంద్రస్థానంగా మారింది. ఇందులో పనిచేసే 1,400 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు క్వారంటైన్‌ పాలయ్యారు. జుబిలియంట్‌ ఫార్మాకు తరచుగా చైనా నుంచి ముడిసరుకు దిగుమతి అవుతుంది. మార్చి 15న వచ్చిన కంటైనర్లను 17న క్వాలిటీ అస్సూరెన్స్‌ ఉద్యోగి ఆ సరుకును తనిఖీ చేశారు. ఆ తర్వాతి రోజే ఆయన అస్వస్థతకు గురై సెలవు పెట్టారు. 19న మైసూరులోని గోపాలగౌడ ఆస్పత్రిలో చేరారు. 26న కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో వెంటనే ఐసొలేషన్‌కు పంపారు. తాజాగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా 8 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వారిలో ఐదుగురు ఫార్మా కంపెనీ ఉద్యోగుల సన్నిహితులే ఉన్నారు. 

Updated Date - 2020-04-12T07:57:05+05:30 IST