మయోన్మార్‌లో డెంగీ జ్వరాల జోరు..సర్కారు అలర్ట్
ABN , First Publish Date - 2020-07-18T12:20:10+05:30 IST
మయన్మార్‌లో కరోనా కల్లోలానికి తోడు డెంగీ జ్వరాల జోరు ప్రజలను వణికిస్తోంది....

హనోయ్: మయన్మార్‌లో కరోనా కల్లోలానికి తోడు డెంగీ జ్వరాల జోరు ప్రజలను వణికిస్తోంది. మయన్మార్ లో డెంగీ కేసుల సంఖ్య 2,862కు చేరడంతోపాటు 20 మంది దీని వల్ల మరణించారు. దీంతో మయన్మార్ ఆరోగ్య, క్రీడా మంత్రిత్వశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మయన్మార్‌లోని 20 నగరాల్లో డెంగీ జ్వరాల వల్ల 12 మంది మరణించారు. దోమల వ్యాప్తి వల్ల డెంగీ జ్వరాలు ప్రబలుతుండటంతో సర్కారు ప్రజలను అప్రమత్తం చేశారు. డెంగీ జ్వరాలు పెరగకుండా సర్కారు దోమల నివారణకు చర్యలు చేపట్టింది. గత ఏడాది మయన్మార్ లో 24,345 డెంగీకేసులు నమోదు కాగా వంద మంది మరణించారు. దీంతో ప్రజలను అప్రమత్తం చేసిన సర్కారు దోమల నియంత్రణకు కదిలింది.