ఈ పద్ధతిలో సోషల్ డిస్టేన్సింగ్ చూడాల్సిందే!

ABN , First Publish Date - 2020-03-26T00:47:06+05:30 IST

కొత్తగా ఆలోచించే సత్తా ఉన్నవారికి ప్రతి సమస్య ఓ గొప్ప అవకాశంగానే నిలుస్తుంది. కోవిడ్-19 మహమ్మారి వల్ల సాటి మనుషుల్ని సైతం దగ్గరకు రానివ్వలేకపోతున్నాం. తప్పనిసరిగా మనుషుల మధ్య దూరం పాటించవలసి వస్తోంది.

ఈ పద్ధతిలో సోషల్ డిస్టేన్సింగ్ చూడాల్సిందే!

తిరువనంతపురం : కొత్తగా ఆలోచించే సత్తా ఉన్నవారికి ప్రతి సమస్య ఓ గొప్ప అవకాశంగానే నిలుస్తుంది. కోవిడ్-19 మహమ్మారి వల్ల సాటి మనుషుల్ని సైతం దగ్గరకు రానివ్వలేకపోతున్నాం. తప్పనిసరిగా మనుషుల మధ్య దూరం పాటించవలసి వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓ దుకాణదారుడు వినూత్నంగా ఆలోచించారు. ఆయన అనుసరించిన పద్ధతి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌ను కూడా ఆకర్షించింది. ఈ ఫొటోతో ఓ ట్వీట్ చేసి,  ఈ విధానాన్ని అందరికీ పరిచయం చేశారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతోంది.


కరోనా వైరస్ మహమ్మారిని నిరోధించాలంటే మనుషులు ఒకరికొకరు దూరంగా ఉండటం చాలా ముఖ్యమని తెలియడంతో కేరళలోని ఓ దుకాణం యజమానికి వినూత్న ఆలోచన వచ్చింది. తన దుకాణానికి వచ్చి, సరుకులు కొనేవారిని నిజంగానే చాలా దూరంగా ఉంచుతున్నారు. సరుకులను ఓ పీవీసీ పైపు ద్వారా అందజేస్తున్నారు. ఓ బల్లకు పీవీసీ గొట్టాన్ని కట్టేసి, దానిలో సరుకులను పోస్తున్నారు. ఆ గొట్టం రెండో భాగం నుంచి వాటిని కొనుక్కునేవారి సంచీలోకి వెళ్ళేలా ఏర్పాట్లు చేశారు. 


శశి థరూర్ ఈ ఫొటోను జత చేసి, ‘‘నిత్యావసర సరుకులను కొనేటపుడు దుకాణదారుడు, కస్టమర్ మధ్య భౌతిక దూరం పాటించడం ఎలా?’’ అనే శీర్షికతో పోస్ట్ చేశారు.


Updated Date - 2020-03-26T00:47:06+05:30 IST