ముస్లిం మహిళ కుటుంబాన్ని చంపేస్తాం
ABN , First Publish Date - 2020-08-20T07:05:28+05:30 IST
ఓ ముస్లిం మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులందరినీ చంపేస్తామంటూ ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో పోస్టర్లు వెలిశాయి. ఇస్లాం మతం నుంచి బహిష్కరిస్తామని కూడా అందులో పేర్కొన్నారు...

- రామ్ లల్లాను పూజించినందుకు బెదిరింపు పోస్టర్లు
అలీగఢ్, ఆగస్టు 19: ఓ ముస్లిం మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులందరినీ చంపేస్తామంటూ ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో పోస్టర్లు వెలిశాయి. ఇస్లాం మతం నుంచి బహిష్కరిస్తామని కూడా అందులో పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం జరిగిన భూమిపూజ సందర్భంగా అలీగఢ్‌కు చెందిన బీజేపీ నాయకురాలు రుబీ ఆసిఫ్ ఖాన్ తన ఇంటి వద్ద రామ్‌లల్లా హారతి పూజలో పాల్గొన్నారు. మందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు రూ.5,100 విరాళంగా ఇచ్చారు. అలాగే, రామ్‌లల్లాకు రాఖీ పంపారు. ఈ నేపథ్యంలోనే ఆమెను బెదిరిస్తూ అలీగఢ్‌లో పోస్టర్లు వెలిశాయి. దీంతో కొందరు బీజేపీ కార్యకర్తలతో కలిసి రుబీ ఆసిఫ్ ఖాన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.