వైద్యులపై దాడికి ముస్లిం సంస్థ క్షమాపణ

ABN , First Publish Date - 2020-04-07T08:09:15+05:30 IST

ఇండోర్‌లోని తత్పత్తి బఖాల్‌ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం వైద్య సిబ్బందిపై జరిగిన దాడికి స్థానిక ముస్లిం సంస్థ ఒకటి క్షమాపణలు కోరింది. ఈ మేరకు ఒక వార్తాపత్రికలో తమ క్షమాపణల్ని ప్రకటనగా...

వైద్యులపై దాడికి ముస్లిం సంస్థ క్షమాపణ

ఇండోర్‌, ఏప్రిల్‌ 6: ఇండోర్‌లోని తత్పత్తి బఖాల్‌ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం వైద్య సిబ్బందిపై జరిగిన దాడికి స్థానిక ముస్లిం సంస్థ ఒకటి క్షమాపణలు కోరింది. ఈ మేరకు ఒక వార్తాపత్రికలో తమ క్షమాపణల్ని ప్రకటనగా ప్రచురించింది. ‘‘డా.తృప్తి కటారియా, డా.జకీయా సయ్యద్‌, ఇతర వైద్యులు, నర్సులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, కరోనాపై పోరులో భాగస్వాములైన అందరికీ ఈ లేఖ. ఇటీవల జరిగిన దాడి విషయంలో మీకు క్షమాపణలు చెప్పేందుకు మావద్ద మాటల్లేవు. కేవలం పుకార్ల కారణంగా జరిగిన ఈ దాడిపై మేము సిగ్గుపడుతున్నాం. మీ అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాం. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని మాట ఇస్తున్నాం’’ అని ఆ ప్రకటనలో సదరు సంస్థ పేర్కొంది. 


Read more