కోళ్లఫారం యజమాని దారుణ హత్య

ABN , First Publish Date - 2020-05-24T14:39:30+05:30 IST

ఓ కోళ్లఫారం యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. నెమిలి పోలీసుల కథనం మేరకు..

కోళ్లఫారం యజమాని దారుణ హత్య

చెన్నై:  ఓ కోళ్లఫారం యజమాని దారుణ హత్యకు  గురయ్యాడు. నెమిలి పోలీసుల కథనం మేరకు..కాంచీపురం జిల్లా చిన్న కాంచీపురానికి చెందిన భారతి(24) రాణిపేట జిల్లా అరక్కోణం సమీపం కీల్‌వెంకటాపురంలో కోళ్ల ఫారం నడుపుతున్నాడు. ఆయన రోజూ కాంచీపురం నుంచి నెమిలికి బైక్‌పై వచ్చేవాడు. కాగా భార్య సంగీతతో కలసి   కోళ్ల ఫారానికి వచ్చి, అక్కడ తాత మణిపిళ్లై ఇంట్లో భార్యను వదలిపెట్టిన స్నేహితులను కలుసుకొనేందుకు వెళ్తున్నానని భార్యతో చెప్పి భారతి  వెళ్లాడు. అయితే అర్ధరాత్రైనా అతను ఇంటికి రాలేదు. శనివారం ఉదయం ఆ ప్రాంతంలోని ధనశేఖర్‌ రైస్‌మిల్‌ ప్రహరీ పక్కన తీవ్ర గాయాలతో భారతి మృతదేహాన్ని కనుగొన్నారు. సమాచారం అందుకున్న నెమిలి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పతికి తరలించారు.  స్నేహితులతో మద్యం సేవించే సమయంలో ఘర్షణలు తలెత్తి భారతి హత్యకు గురై ఉంటాడని భావిస్తున్నట్టు  పోలీసులు తెలిపారు. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2020-05-24T14:39:30+05:30 IST