భూ తగాదాల్లో దంపతుల దారుణహత్య

ABN , First Publish Date - 2020-05-13T13:39:17+05:30 IST

కరూర్‌లో భూతగాదాల కారణంగా దంపతులను హత్యచేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

భూ తగాదాల్లో దంపతుల దారుణహత్య

చెన్నై: కరూర్‌లో భూతగాదాల కారణంగా దంపతులను హత్యచేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాయలూర్‌ తిల్లైనగర్‌ ప్రాంతానికి చెందిన ఏసీ మెకానిక్‌ రంగనాథన్‌ (37), దీపిక (28) దంపతులకు అక్షయ (3) అనే కుమార్తె ఉంది. రంగనాథన్‌ బామ్మ పాపమ్మాళ్‌ అదే ప్రాంతంలో నాలుగు సెంట్ల స్థలాన్ని తన కుమార్తెలు కన్నమ్మాళ్‌, రాణిలకు సమానంగా అందజేసింది.  ఈ స్థలం విషయమై రంగనాథన్‌, రాణి కుమారులు పార్తీపన్‌, గౌతమన్‌, ప్రవీణ్‌కుమార్‌ మధ్య పదేళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సోదరులు ముగ్గురు రంగనాథన్‌ ఇంట్లో ప్రవేశించి అతడితో పాటు భార్య దీపికలపై కత్తులతో దాడిచేసి పరారయ్యారు. వారి కుమార్తె అక్షయ చాలసేపటి వరకు ఏడుస్తుండడం గమనించిన చుట్టుపక్కల వారు అక్కడకు వచ్చి చూసి రక్తపుమడుగుల్లో పడివున్న దంపతులను చూసి దిగ్ర్భాంతి చెందారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి పరారీలో ఉన్న ముగ్గురు సోదరుల కోసం గాలిస్తున్నారు.

Read more