మహారాష్ట్రలో 700కు చేరువైన కేసులు.. ముంబైలో కొత్తగా 29

ABN , First Publish Date - 2020-04-05T22:58:36+05:30 IST

మహారాష్ట్రలో కోవిడ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 690కి

మహారాష్ట్రలో 700కు చేరువైన కేసులు.. ముంబైలో కొత్తగా 29

ముంబై: మహారాష్ట్రలో కోవిడ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 690కి చేరుకోగా అందులో ఒక్క ముంబై నుంచే 406 కేసులు ఉండడం గమనార్హం. తాజాగా ముంబైలో నేడు మరో 29 కొత్త కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. అలాగే, కరోనా వైరస్ నుంచి కోలుకున్న 56 మందిని డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఉదయం పూణెలో 17, పింప్రి చించ్వాడ టౌన్‌‌షిప్‌లో నాలుగు, అహ్మద్‌నగర్‌లో మూడు, ఔరంగాబాద్‌లో రెండు కలిపి మొత్తం 26 కేసులు నమోదయ్యాయి.


శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 635 కేసులు నమోదు కాగా, 32 మంది మృతి చెందారు. ఔరంగాబాద్ జిల్లాలో 58 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు విడిచాడు. మరాఠ్వాడా ప్రాంతంలో ఇదే తొలి మరణం. రెండు రోజుల క్రితమే అతడు కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఉదయం అతడికి పాజిటివ్ రిపోర్టులు రాగా, మధ్యాహ్నానికి ప్రాణాలు కోల్పోయాడు. నవీ ముంబైలోని వషి ప్రాంతంలో కోవిడ్‌ను వ్యాపిస్తున్నారన్న ఆరోపణలపై 10 మంది ఫిలిప్పీన్స్ జాతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-04-05T22:58:36+05:30 IST