బార్క్‌ మాజీ సీఈఓకు అర్ణబ్‌ నుంచి లక్షలు

ABN , First Publish Date - 2020-12-29T09:30:44+05:30 IST

బ్రాడ్‌కాస్ట్‌ రిసెర్చ్‌ ఆడియన్స్‌ కౌన్సిల్‌(బార్క్‌) రేటింగ్స్‌లో మోసం కోసం మాజీ సీఈఓ పార్థ్‌ దాస్‌గుప్తాకు రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌-ఇన్‌-చీ్‌ఫ

బార్క్‌ మాజీ సీఈఓకు అర్ణబ్‌ నుంచి లక్షలు

ముంబై పోలీసులు ఆరోపణ


ముంబై, డిసెంబరు 28: బ్రాడ్‌కాస్ట్‌ రిసెర్చ్‌ ఆడియన్స్‌ కౌన్సిల్‌(బార్క్‌) రేటింగ్స్‌లో మోసం కోసం మాజీ సీఈఓ పార్థ్‌ దాస్‌గుప్తాకు రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌-ఇన్‌-చీ్‌ఫ అర్ణబ్‌ గోస్వామి లక్షలాది రూపాయలు చెల్లించారని ముంబై పోలీసులు తాజాగా ఆరోపించారు. ఈ మేరకు ఒక రిమాండ్‌ నోట్‌ ను విడుదల చేశారు. ‘‘రిపబ్లిక్‌ టీవీకి అనుకూలంగా దాస్‌గుప్తా వ్యవహరించారు. ఆ చానెల్‌కు టీవీ రేటింగ్‌ పాయింట్స్‌(టీఆర్‌పీ) ఎక్కువ వచ్చేందుకు తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. రిపబ్లిక్‌ టీవీ, రిపబ్లిక్‌ భారత్‌ చానెళ్ల నుంచి ఆయనకు రూ. లక్షలు ప్రతిఫలంగా అందాయి.  2016 నుంచి 2019 మధ్యలో ఈ కుంభకోణం జరిగింది.’’ అని పోలీసులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-29T09:30:44+05:30 IST