2022లో ప‌రుగులు తీయ‌నున్న ముంబైలోని అత్యంత ఎత్త‌యిన మెట్రో!

ABN , First Publish Date - 2020-07-28T12:24:02+05:30 IST

ముంబైలోని అత్యంత ఎత్త‌యిన‌ మెట్రో- 6 కారిడార్ స్టేషన్ల‌కు సంబంధించిన పనులు 48 శాతం మేర‌కు పూర్తయ్యాయి. 2022 నాటికి ఈ మార్గంలో మెట్రో ప‌రుగులు తీయ‌నుంది. ఎంఎంఆర్ ప్రాంతంలో మెట్రోకు...

2022లో ప‌రుగులు తీయ‌నున్న ముంబైలోని అత్యంత ఎత్త‌యిన మెట్రో!

ముంబై: ముంబైలోని అత్యంత ఎత్త‌యిన‌ మెట్రో- 6 కారిడార్ స్టేషన్ల‌కు సంబంధించిన పనులు 48 శాతం మేర‌కు పూర్తయ్యాయి. 2022 నాటికి ఈ మార్గంలో మెట్రో ప‌రుగులు తీయ‌నుంది. ఎంఎంఆర్ ప్రాంతంలో మెట్రోకు సంబంధించిన‌ 13 కారిడార్ల పనులు జరుగుతున్నాయి. మెట్రో- 6 కారిడార్ మినహా అన్ని కారిడార్ల‌ను భూమి నుంచి 16 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. స్వామి సమర్థ్‌నగర్ నుంచి విఖ్రోలి మధ్య నిర్మిస్తున్న మెట్రో- 6 కారిడార్ భూమి నుంచి 38 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. ముంబైలో నిర్మిస్తున్న మెట్రో -6 ఎత్తు 13 అంతస్తుల భవనానికి సమానంగా ఉండ‌నుంది. ఈ కారిడార్ మార్గంలో మొత్తం 778 స్తంభాలను నిర్మించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 98 స్తంభాల నిర్మాణం పూర్తయింది. 58 స్తంభాల నిర్మాణం స‌గానికిపైగా పూర్త‌య్యింది. అదే సమయంలో 622 స్తంభాల నిర్మాణ పనులు ఇంకా జరగాల్సి ఉంది. ఎంఎంఆర్డీఏ 14.47 కిలోమీటర్ల పొడవైన‌ మెట్రో- 6 కారిడార్‌ను నిర్మిస్తోంది. ఈ కారిడార్ లోఖండ్‌వాలా-జోగేశ్వరి-కంజూర్‌మార్గ్ మీదుగా విఖ్రోలికి వెళ్తుంది. మెట్రో -6 లో మొత్తం 13 స్టేషన్లు ఉంటాయి. ఈ మెట్రో మార్గ‌నిక‌య్యే మొత్తం ఖర్చు రూ .6,672 కోట్లు. మెట్రో -6 స్టేషన్‌కు సంబంధించిన‌ ఫౌండేషన్, పైలటింగ్ పనులు 48 శాతం మేర‌కు పూర్తయ్యాయి. మెట్రో -4, మెట్రో -6 కారిడార్ల స్టేషన్లను ఫుట్ ఓవర్ బ్రిడ్జి ద్వారా అనుసంధానించ‌నున్నారు. ముంబైలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించడానికి మెట్రో-6 సహాయపడుతుంది.

Updated Date - 2020-07-28T12:24:02+05:30 IST