ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ములాయం సింగ్ యాదవ్
ABN , First Publish Date - 2020-05-10T02:17:19+05:30 IST
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆసుపత్రి నుంచి
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఉదర, మూత్ర సంబంధిత సమస్యలతో ములాయం సింగ్ బుధవారం లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో నేటి (శనివారం) మధ్యాహ్నం డిశ్చార్జ్ చేసినట్టు పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు.
రొటీన్ చెకప్‌లో భాగంగానే ములాయం ఆసుపత్రికి వెళ్లారని, అయితే, ఆయనను పరీక్షించిన వైద్యులు పర్యవేక్షణ కోసం అడ్మిట్ చేసుకున్నారని చౌదరి పేర్కొన్నారు. తండ్రి ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ శుక్రవారమే ఆయనను కలిసినట్టు ఆయన వివరించారు.