మరో లవ్ జిహాద్: వసీమ్‌గా మారిన వికాస్... గుట్టువిప్పిన డ్రైవింగ్ లైసెన్స్!
ABN , First Publish Date - 2020-12-20T15:56:09+05:30 IST
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మరో లవ్ జిహాద్ వ్యవహారం వెలుగుచూసింది. ఈ ఉదంతంలో...

ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మరో లవ్ జిహాద్ వ్యవహారం వెలుగుచూసింది. ఈ ఉదంతంలో ఒక యువకుడు పేరు మార్చుకుని విడాకులు పొందిన మహిళతో రెండేళ్లుగా రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నాడు. ఆ యువకుడు తొలుత తన పేరు తప్పుగా చెప్పి, ఆమెతో పరిచయం పెంచుకుని, తరువాత సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఆ యువకుడు తన పేరును వికాస్ అని చెప్పాడు.
అయితే ఆ మహిళ అతని పర్సు చెక్ చేయగా, దానిలోవున్న డ్రైవింగ్ లైసెన్స్‌పై అతని పేరు వసీమ్ అని ఉంది. దీంతో ఆమె ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ మహిళ భర్తతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఉజ్జయినిలో ఉంటోంది. రెండేళ్ల క్రితం ఆమెకు వికాస్ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. తరువాత వారి మధ్య అనుబంధం పెరిగింది. వారు ఎప్పుడు ఆలయానికి వెళ్లినా, అతను బయటనే ఉండేవాడు. ఆమె దీని గురించి అడిగితే, తాను నాస్తికుడినని చెప్పేవాడు. అయితే ఇటీవల ఆమె అనుమానంతో అతని పర్సు తనిఖీ చేయగా, అసలు విషయం బయటపడింది. దీంతో ఆమె పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.