అనుపమ్ ఖేర్ భార్య ఆదర్శం
ABN , First Publish Date - 2020-03-24T00:20:18+05:30 IST
చండీఘర్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో చండీఘర్ ఎంపీ కిరన్ ఖేర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

చండీగఢ్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో చండీఘర్ ఎంపీ కిరన్ ఖేర్ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. తన ఎంపీ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్ (ఎంపీలాడ్)నుంచి కోటి రూపాయలు విడుదల చేశారు. చండీఘర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెంటీలేటర్లు కొనేందుకు, కరోనా పరీక్షలు నిర్వహించే ఉపకరణాల కోసం ఈ నిధులు వాడాలని సూచించారు. కిరణ్ ఖేర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ భార్య.
అటు పంజాబ్‌లో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో అమరీందర్ సింగ్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 31 వరకూ అక్కడ ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు.