తబ్లీగీ సభ్యుల సమాచారాన్ని తెలిపిన వారికి పారితోషికం ప్రకటించిన ఎంపీ
ABN , First Publish Date - 2020-04-25T20:32:10+05:30 IST
తబ్లీగీ సదస్సుకు వెళ్లి, సమాచారం దాచిపెట్టిన వారి సమాచారాన్ని చెప్పిన వారికి పదకొండు వేల రూపాయలను బహుమానంగా ఇస్తామని బీజేపీ ఎంపీ రవీంద్ర

న్యూఢిల్లీ : తబ్లీగీ సదస్సుకు వెళ్లి, సమాచారం దాచిపెట్టిన వారి సమాచారాన్ని చెప్పిన వారికి పదకొండు వేల రూపాయలను బహుమానంగా ఇస్తామని బీజేపీ ఎంపీ రవీంద్ర కుష్వాహా ప్రకటించారు. తబ్లీగీ సదస్సుకు వెళ్లొచ్చిన వారిలో కొందరు సరియైన పరీక్షలు కూడా చేసుకోవడం లేదని, అలాగే అధికారులకు కూడా రిపోర్టు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. అలాంటి వారందరూ వెంటనే స్థానిక అధికార గణానికి తమ సమాచారాన్ని చెప్పి, వెంటనే పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు. అలా చేసుకోకుండా ఉన్న వారి సమాచారాన్ని ఎవరైనా వెల్లడిస్తే వారికి పదకొండు వేల పారితోషికాన్ని ఇస్తామని రవీంద్ర కుష్వాహా ప్రకటించారు.