రాజధానిలో సినిమా హాళ్లు తెరిచేందుకు సన్నాహాలు

ABN , First Publish Date - 2020-10-07T12:48:27+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్-5లో విడుదల చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం అక్టోబరు 15 నుంచి సినిమాహాళ్లు, మల్టీఫ్లెక్స్‌లను 50 శాతం ప్రేక్షకుల హాజరుతో తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ నేపధ్యంలో దేశరాజధాని ఢిల్లీలలో సినిమాహాళ్లు...

రాజధానిలో సినిమా హాళ్లు తెరిచేందుకు సన్నాహాలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్-5లో విడుదల చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం అక్టోబరు 15 నుంచి సినిమాహాళ్లు, మల్టీఫ్లెక్స్‌లను 50 శాతం ప్రేక్షకుల హాజరుతో తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ నేపధ్యంలో దేశరాజధాని ఢిల్లీలలో సినిమాహాళ్లు తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం సినిమాహాళ్ల యజమానులు ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక గైడ్‌లైన్స్‌ను అనుసరిస్తున్నారు.


ఢిల్లీలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాలలో అన్ని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఏడు నెలల తరువాత సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు. మరోవైపు ఢిల్లీలో కరోనా పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం సినిమా హాళ్లు తెరిచేందుకు సుముఖంగా ఉంది. తద్వారా ఈ రంగంపై ఆధారపడినవారికి తిరిగి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 

Updated Date - 2020-10-07T12:48:27+05:30 IST