మాతృభాషలోనే పిల్లలకు పునాది!

ABN , First Publish Date - 2020-10-07T08:22:30+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య లు చేసింది. పిల్లలకు మాతృభాషలో పునాదులు అవసరమని స్పష్టం చేసింది...

మాతృభాషలోనే పిల్లలకు పునాది!

  • తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం

న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య లు చేసింది. పిల్లలకు మాతృభాషలో పునాదులు అవసరమని స్పష్టం చేసింది. ‘దీనిని మామూ లు అంశంగా మేం భావించడం లేదు. ఇంగ్లీష్‌ మాధ్య మం, ఇతర భాష మాధ్యమం విషయంలో తేడా ఉం టుంది. అంతర్జాతీయంగా పరిశీలిస్తే.. రష్యా, చైనాతో పా టు అనేక దేశాల్లో మాతృభాషలోనే విద్యను బోధిస్తున్నారు’అని వ్యాఖ్యానించింది. తామేమీ విభేదించడం లేద ని.. తెలుగు మీడియంను కూడా అందుబాటులో ఉంచుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవా ది కేవీ విశ్వనాథన్‌ అన్నారు. ‘వ్యక్తిగతంగా మీ వాదనను అంగీకరిస్తున్నాం. కానీ మా అభిప్రాయాలను రుద్దాలనుకోవడం లేదు. అన్నీ పరిశీలించాల్సిన నేపథ్యంలో ప్రస్తు తం మీతో విభేదిస్తున్నాం’ అని ధర్మాసనం తెలిపింది. ఆంగ్ల మాధ్యమంలో బోధన నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్‌ ఎస్‌.ఏ.బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన త్రి సభ్య ధర్మాసనం విచారణ జరిపింది. వేరే ధర్మాసనం నుంచి తమ ముందుకు ఈ వ్యాజ్యం వచ్చినందున దీని ని అధ్యయనం చేయలేదని, కాబట్టి విచారణ వాయిదా వేస్తామని తెలిపింది. విశ్వనాథన్‌ 3 నిమిషాల సమయం తీసుకొని వాదనలు వినిపించారు. ‘ఇప్పుడు మేం వాదన లు వినడం లేదు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే నిరాకరించా ల్సి వస్తుంది’ అని హెచ్చరించింది. దానివల్ల తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్వనాథన్‌ అన్నారు.

Updated Date - 2020-10-07T08:22:30+05:30 IST