కరోనా ఎఫెక్ట్: కన్నబిడ్డను చూడాలన్నా వీడియోకాలే గతి!

ABN , First Publish Date - 2020-04-25T23:07:27+05:30 IST

కరోనా మహమ్మారి మనుషుల మధ్య పెద్ద గోడలా నిలుస్తోంది.

కరోనా ఎఫెక్ట్: కన్నబిడ్డను చూడాలన్నా వీడియోకాలే గతి!

ఔరంగాబాద్: కరోనా మహమ్మారి మనుషుల మధ్య పెద్ద గోడలా నిలుస్తోంది. తల్లీబిడ్డలను కూడా దూరం చేస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. కొన్ని రోజుల క్రితం ఓ గర్భవతి.. ఔరంగాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పండంటి బబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు కరోనా సోకి ఉండటంతో ఐసోలేషన్ వార్డుకు తరలించారు. పుట్టిన బిడ్డకు కరోనా సోకలేదు. దీంతో బిడ్డను తల్లి నుంచి వేరు చేసి వేరే వార్డులో ఉంచారు. ఈ నేపథ్యంలో తన బిడ్డను ఒక్కసారి చూడాలని ఆ తల్లి కోరింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది వీడియోకాల్ ద్వారా ఆ తల్లికి బిడ్డను చూపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2020-04-25T23:07:27+05:30 IST