కుమారునికి అశృనయనాలతో ఆన్ లైన్ లో అంత్యక్రియలు
ABN , First Publish Date - 2020-04-05T14:11:26+05:30 IST
బ్రిటన్‌లోని ఒక తల్లి తన కుమారుని అంత్యక్రియలను ఆన్లైన్లో చూడాల్సి వచ్చింది. ఆమె 13 ఏళ్ల కుమారుడు కరోనా వైరస్ తో మరణించాడు. తల్లి, ఆరుగురు తోబుట్టువులు చివరిసారిగా ఆ బాలుడిని....

లండన్: బ్రిటన్‌లోని ఒక తల్లి తన కుమారుని అంత్యక్రియలను ఆన్లైన్లో చూడాల్సి వచ్చింది. ఆమె 13 ఏళ్ల కుమారుడు కరోనా వైరస్ తో మరణించాడు. తల్లి, ఆరుగురు తోబుట్టువులు చివరిసారిగా ఆ బాలుడిని చూడలేకపోయారు. కరోనా వైరస్ కారణంగా బాధితులను ఒంటరిగా ఉంచుతారు. దక్షిణ లండన్‌లోని బ్రిక్స్టన్ కు చెందిన ఇస్మాయిల్ మొహమ్మద్ అబ్దుల్వాబ్ కరోనాతో కింగ్స్ కాలేజీ ఆసుపత్రిలో మరణించాడు. ఇస్లామిక్ ఆచారం ప్రకారం మృతదేహాన్ని సాంప్రదాయకంగా ప్రత్యేక ప్రార్థనల కోసం మసీదుకు తీసుకువెళతారు. అయితే ఇప్పుడు ఎదురైన పరిస్థితిలో ఇస్మాయిల్‌ను నేరుగా ఆసుపత్రి నుంచి స్మశానవాటికకు తీసుకెళ్లారు. అతని కుటుంబ సభ్యుల అక్కడకు వచ్చినా, వారిని చాలా దూరంలో ఉంచారు. ఇస్మాయిల్ తల్లి సాడియాతో పాటు ఆమె ఆరుగురు పిల్లలు అతనిని చివరిసారిగా చూడాలనుకున్నారు. అయితే అది కుదరలేదు. అయితే తల్లి పదేపదే అభ్యర్థించడంతో మృతుని అంత్యక్రియలను ఆన్లైన్లో చూడటానికి ఏర్పాట్లు చేశారు.