తల్లీ కూతుళ్ల ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-07-19T07:26:40+05:30 IST

సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఉదంతమిది. ఆపదలో ఉన్నవారికి గుండె ధైర్యం నింపాల్సిన రాజకీయ నాయకులే ఆత్మహత్యకు ప్రేరేపించారు. దీంతో.. అమేఠీకి చెందిన తల్లీకూతుళ్లు లఖ్‌నవూలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కార్యాలయం(సీఎంవో) వద్ద పెట్రోల్‌ పోసుకుని...

తల్లీ కూతుళ్ల ఆత్మహత్యాయత్నం

  • యూపీ సీఎంవో ముందు ఘటన


లఖ్‌నవూ, జూలై 18: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఉదంతమిది. ఆపదలో ఉన్నవారికి గుండె ధైర్యం నింపాల్సిన రాజకీయ నాయకులే ఆత్మహత్యకు ప్రేరేపించారు. దీంతో.. అమేఠీకి చెందిన తల్లీకూతుళ్లు లఖ్‌నవూలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కార్యాలయం(సీఎంవో) వద్ద పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. 90శాతం కాలిన గాయాలతో తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. సాఫియా(55) అనే మహిళ తన కూతురు గుడియాతో కలిసి అమేఠీలోని జామో పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో నివసిస్తోంది. పొరుగింటి వారి కచ్చామోరీ నుంచి మురుగునీరు వీరి ఇంటి వద్ద నిలుస్తుండటంతో.. తరచూ వివాదాలు జరిగేవి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదు. దీంతో పొరుగింటి వారు మరింత రెచ్చిపోయారు. అర్ధరాత్రి నలుగురు వ్యక్తులు సాఫియాను తీవ్రంగా కొట్టారు. పోలీసులు పట్టించుకోరని, తల్లీకూతుళ్లిద్దరినీ యాక్సిడెంట్‌ చేసి చంపేస్తామని బెదిరించారు. దీంతో విరక్తి చెందిన తల్లీకూతుళ్లు రాజకీయ మద్దతు కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో అమేఠీ జిల్లా మజ్లిస్‌ అధ్యక్షుడు ఖదీర్‌ ఖాన్‌, కాంగ్రెస్‌ నేత అనూప్‌ పటేల్‌, అస్మా, సుల్తాన్‌ అనే వ్యక్తులు.. సీఎంవో ఎదుట ఆత్మహత్యకు యత్నించాలంటూ సలహా ఇచ్చారని లఖ్‌నవూ పోలీసు కమిషనర్‌ సుజీత్‌ పాండే తెలిపారు. వారి సూచనల మేరకు తల్లీకూతుళ్లిద్దరూ సీఎంవో ఎదుట ఆత్మహత్యకు యత్నించారన్నారు. కాగా.. ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బహుజన్‌ సమాజ్‌పార్టీ(బీఎస్పీ), సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) ఆరోపించాయి.


Updated Date - 2020-07-19T07:26:40+05:30 IST