అధిక శాతం మందికి కరోనాను తట్టుకునే స్థితి లేదు: డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2020-05-12T04:37:46+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 40 లక్షలకు మందికి పైగానే కరోనా బారినపడ్డారు. వారిలో 2.83లక్షల కరోనా భూతానికి బలైపోయారు. మరి కోలుకున్న వారిలో కరోనాను తట్టుకునే రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందిదా? వారు.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే బాధ్యతను మోయగలరా? అంటే మాత్రం ఆశాజనకమైన సమాధానం లేదనే చెప్పాలి.

అధిక శాతం మందికి కరోనాను తట్టుకునే స్థితి లేదు: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 40 లక్షల మందికి పైగానే కరోనా బారినపడ్డారు. వారిలో 2.83లక్షల కరోనా భూతానికి బలైపోయారు. మరి కోలుకున్న వారిలో కరోనాను తట్టుకునే రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందిదా? వారు.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే బాధ్యతను మోయగలరా? అంటే మాత్రం ఆశాజనకమైన సమాధానం లేదనే చెప్పాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథోనమ్ చెప్పిన దాని ప్రకారం చాలా తక్కువ శాతం మందిలో కరోనాను తట్టుకునే శక్తి ఉన్నట్టు తెలుస్తోంది.  కరోనాను తిప్పికొట్చే యాంటీబాడీలు అతి కొద్ది మందిలో అభివృద్ధి చెంది, మహమ్మారిని ఢికోనే స్థాయికి రోగ నిరోధక వ్యవస్థ చేరుకుందని ఆయన తెలిపారు. రక్త పరీక్షలు నిర్వహించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామన్నారు. వ్యాక్సిన్ కనుగొనే వరకూ, కరోనాను అడ్డుకునేందుకు సమగ్రమైన వ్యూహమే శరణ్యమని ఆయన స్పష్టం చేశారు.  

Updated Date - 2020-05-12T04:37:46+05:30 IST