అమెరికాలో ఒక్క రోజులో 91 వేలపైగా కేసులు

ABN , First Publish Date - 2020-10-31T07:40:16+05:30 IST

అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా నాలుగు రోజులు కూడా లేని వేళ.. అమెరికాలో కరోనా కలకలం రేపుతోంది. గురువారం అక్కడ

అమెరికాలో ఒక్క రోజులో 91 వేలపైగా కేసులు

వాషింగ్టన్‌, అక్టోబరు 30: అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా నాలుగు రోజులు కూడా లేని వేళ.. అమెరికాలో కరోనా కలకలం రేపుతోంది. గురువారం అక్కడ 91,295 కేసులు నమోదయ్యాయి. జాన్‌హాప్కిన్స్‌ వర్సిటీ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ఇవే అత్యధికం.

కాగా, ఈ నెల మధ్య నుంచి అమెరికాలో పాజిటివ్‌లు పెరుగుతున్నాయి. మొత్తం కేసులు 90 లక్షలకు సమీపించాయి. ఇటీవలి వరకు 500లోపునకు పరిమితమైన మరణాలు.. తాజాగా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. కొత్తగా 1,021 మంది మృతిచెందారు.


Read more