ఇదే కొనసాగితే.. భారత్‌లో 4కోట్ల మంది మొబైల్స్ మర్చిపోవాల్సిందే!

ABN , First Publish Date - 2020-04-25T22:05:05+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా భారతదేశంలో లాక్‌డౌన్ విధించారు.

ఇదే కొనసాగితే.. భారత్‌లో 4కోట్ల మంది మొబైల్స్ మర్చిపోవాల్సిందే!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా భారతదేశంలో లాక్‌డౌన్ విధించారు. దీంతో నిత్యావసర సేవలందించే సంస్థలు తప్ప మిగతా కంపెనీలన్నీ మూతపడ్డాయి. ఈ పరిస్థితి గనుక ఇలానే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఏఈ) పేర్కొంది. లాక్‌డౌన్ వల్ల ఇప్పటికే మొబైల్స్ అమ్మకాలు నిలిచిపోయాయని, ఇది ఇలానే కొనసాగితే మే చివరికల్లా దాదాపు 4కోట్లమంది భారతీయుల వద్ద మొబైల్స్ ఉండవని తెలిపింది. ఇప్పటికే 2.5 కోట్లమంది సరిగా పనిచేయని మొబైల్స్ వాడుతున్నారట. కొత్త ఫోన్లు కొనుక్కోవడానికిగానీ, పాతవి రిపేర్ చేయించుకునే అవకాశంగానీ వీరికి ప్రస్తుతం లేదని ఐసీఏఈ చెప్పింది. ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకానికి అనుమతులివ్వాలని సూచించింది.

Updated Date - 2020-04-25T22:05:05+05:30 IST