లాక్‌డౌన్ ఉల్లంఘ‌న‌లు... 43 వేల కేసులు... రూ. 17 కోట్ల జ‌రిమానాలు

ABN , First Publish Date - 2020-05-13T13:53:02+05:30 IST

లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ గ‌డ‌చిన‌ 50 రోజులలో 43 వేల లాక్‌డౌన్ ఉల్లంఘ‌న‌ల కేసులు న‌మోద‌యిన‌ట్లు ఉత్తర ప్రదేశ్ పరిపాలనా యంత్రాంగం వెల్ల‌డించింది. ఈ నేప‌ధ్యంలో జరిమానాగా...

లాక్‌డౌన్ ఉల్లంఘ‌న‌లు... 43 వేల కేసులు... రూ. 17 కోట్ల జ‌రిమానాలు

లక్నో: లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ గ‌డ‌చిన‌ 50 రోజులలో 43 వేల లాక్‌డౌన్ ఉల్లంఘ‌న‌ల కేసులు న‌మోద‌యిన‌ట్లు ఉత్తర ప్రదేశ్ పరిపాలనా యంత్రాంగం వెల్ల‌డించింది. ఈ నేప‌ధ్యంలో జరిమానాగా సుమారు రూ .17 కోట్లు వ‌సులు చేశారు. ఈ సంద‌ర్భంగా  యూపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవ‌నీష్‌‌ కుమార్ అవస్థీ మాట్లాడుతూ  లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై రాష్ట్ర పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారని, 43,028 కేసులు నమోదు చేశారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 36.5 లక్షలకు పైగా వాహనాలను త‌నిఖీ చేశామ‌ని, 38,950 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారి నుంచి రూ .17.34 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. 

Read more