కొవిడ్-19: పశ్చిమ బెంగాల్లో తొలిసారి ఇలా..

ABN , First Publish Date - 2020-07-28T04:20:30+05:30 IST

కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో తొలిసారి హర్షించదగ్గ ఓ పరిణామం...

కొవిడ్-19: పశ్చిమ బెంగాల్లో తొలిసారి ఇలా..

కోల్‌కతా: కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో తొలిసారి ఓ చల్లటి వార్త తెలిసింది. ఇవాళ నమోదైన కరోనా పాజిటివ్ కేసులకంటే... కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 2,112 కరోనా కేసులు నమోదు కాగా... అదే సమయంలో వివిధ ఆస్పత్రుల నుంచి 2166 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా కొత్తగా ఇన్ఫెక్షన్ సోకిన వారితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 60,830కి చేరినట్టు అధికారులు వెల్లడించారు. ఈ మహమ్మారి కారణంగా మరో 39 మంది ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,411కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,502 యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు కరోనా బారి నుంచి 39,917 మంది కోలుకున్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-07-28T04:20:30+05:30 IST