విస్తృత నీటిపారుదలతో వేడి ముప్పు

ABN , First Publish Date - 2020-10-28T06:42:53+05:30 IST

దేశంలో విస్తృతంగా పెరుగుతున్న నీటిపారుదల సౌకర్యంతో.. ‘మాయిస్ట్‌ హీట్‌ స్ట్రెస్‌’ పెరుగుతోందని ఐఐటీ గాంధీనగర్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. హీట్‌ స్ట్రెస్‌ అంటే.. మన శరీరం ఉష్ణోగ్రతను తగ్గించుకునే శక్తిని కోల్పోవడం...

విస్తృత నీటిపారుదలతో వేడి ముప్పు

న్యూఢిల్లీ, అక్టోబరు 27: దేశంలో విస్తృతంగా పెరుగుతున్న నీటిపారుదల సౌకర్యంతో.. ‘మాయిస్ట్‌ హీట్‌ స్ట్రెస్‌’ పెరుగుతోందని ఐఐటీ గాంధీనగర్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. హీట్‌ స్ట్రెస్‌ అంటే.. మన శరీరం ఉష్ణోగ్రతను తగ్గించుకునే శక్తిని కోల్పోవడం. మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు. అంతకంటే ఎక్కువైతే చెమట ద్వారా శరీరం తనను తాను చల్లబరుచుకుంటుంది. ఒకస్థాయి దాటితే ఆ వ్యవస్థలేవీ సరిపోవు. అలాంటి స్థితిని హీట్‌స్ట్రెస్‌ అంటారు. దీని ప్రభావం  దక్షిణాసియాలో దాదాపు 4.6 కోట్ల మందిపై ఉంటుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన విమల్‌ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-10-28T06:42:53+05:30 IST