సడలింపులున్నాయని... సుతిమెత్తగా రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

ABN , First Publish Date - 2020-05-18T19:00:16+05:30 IST

నాలుగో దశలో అనేక సడలింపులిచ్చిన కేంద్రం ఒక విషయంలో మాత్రం అన్ని రాష్ట్రాలకు తీవ్ర హెచ్చరికలను చేసింది. సడలింపులు

సడలింపులున్నాయని... సుతిమెత్తగా రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

న్యూఢిల్లీ : నాలుగో దశలో అనేక సడలింపులిచ్చిన కేంద్రం ఒక విషయంలో మాత్రం అన్ని రాష్ట్రాలకు తీవ్ర హెచ్చరికలను చేసింది. సడలింపులు ఇచ్చినా... ఆంక్షలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు కార్చవద్దని కేంద్ర హోంశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలకూ తేల్చి చెప్పింది. ఇన్ని సడలింపులిచ్చినా, స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని కార్యకలాపాలను నిషేధించాలని భావిస్తే మాత్రం నిరభ్యంతరంగా వాటిపై నిషేధం విధించి, మరింత కఠినతరంగా వ్యవహరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పూర్తి స్వేచ్ఛ  ఉందని హోంశాఖ తేల్చి చెప్పింది.


‘‘ఇంతకు పూర్వం చాలా లేఖల్లో పేర్కొన్నట్లు... ఆయా రాష్ట్రాలు మాత్రం విధించిన ఆంక్షలు మాత్రం నీరుగారకుండా చూడాలి. స్థానిక పరిస్థితుల దృష్ట్యా, అవసరార్థం రాష్ట్రాలు కొన్ని కార్యకలాపాలపై నిరభ్యంతరంగా ఆంక్షలను విధించొచ్చు. కొన్ని జోన్లలో కార్యకలాపాలకు పరిమితులు ఇచ్చుకునే అధికారం ఉంది.... లేదా వాటిని పూర్తిగా నిషేధించే అధికారం కూడా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉంది. కానీ ఆంక్షలను మాత్రం నీరుకార్చవద్దు... పదే పదే ఇదే మా విజ్ఞప్తి’’ అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు లేఖలు రాస్తూ... సుతిమెత్తగా హెచ్చరించారు. అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్రం సూచించిన నిబంధనలు అమలయ్యేలా చూస్తూనే... ఆయా అధికారులు కఠినంగా అమలు చేసేలా చూడాలని అన్ని రాష్ట్రాలకు అజయ్ భల్లా కోరారు. 

Updated Date - 2020-05-18T19:00:16+05:30 IST