‘పుట్టిన రోజు ఆకాంక్ష ఇదే’’ అంటూ మోదీ ఆసక్తికర ట్వీట్

ABN , First Publish Date - 2020-09-18T16:59:33+05:30 IST

దేశ, విదేశాల అధినేతలు, సామాన్యులు, సెలెబ్రెటీల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుకున్న తరువాత

‘పుట్టిన రోజు ఆకాంక్ష ఇదే’’ అంటూ మోదీ ఆసక్తికర ట్వీట్

న్యూఢిల్లీ : దేశ, విదేశాల అధినేతలు, సామాన్యులు, సెలెబ్రెటీల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుకున్న తరువాత ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘మీ పుట్టిన రోజు సందర్భంగా మీరు కోరుకునేది ఏది?’’ అంటూ చాలా మంది తనను అడిగారని, అందుకే ఈ ట్వీట్ అంటూ మోదీ పేర్కొన్నారు. ‘‘ఈ భూమిని, ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుదాం’’ ఇదే నా ఆకాంక్ష అంటూ మోదీ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.


‘‘మీ పుట్టిన రోజు సందర్భంగా మీరేమి ఆశిస్తున్నారంటూ చాలా మంది నన్ను అడుగుతున్నారు. ‘‘ఎప్పుడూ మాస్క్ ధరించండి. సరైన పద్ధతిలో ధరించండి. భౌతిక దూరాన్ని పాటించండి. రెండు గజాల దూరం అన్న అంశాన్ని మరిచిపోకండి. రద్దీ ఉన్న ప్రాంతాల్లో చేరకండి. మీమీ రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. మన ప్రపంచాన్ని, సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచండి. నేను కోరుకునేది ఇదే’’ అంటూ మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

Updated Date - 2020-09-18T16:59:33+05:30 IST