అమర్ సింగ్ మరణంపై ప్రధాని మోదీ ట్వీట్
ABN , First Publish Date - 2020-08-02T00:47:48+05:30 IST
రాజ్యసభ సభ్యుడు, సీనియర్ రాజకీయ వేత్త అమర్ సింగ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యుడు, సీనియర్ రాజకీయ వేత్త అమర్ సింగ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘‘అమర్ సింగ్ అత్యంత ఉత్తేజవంతులైన రాజకీయ వేత్త. కొన్ని దశాబ్దాల పాటు అనేక రాజకీయ సంఘటనలకు ఆయన సాక్షీభూతుడు. ఆయన జీవితంలో అనేక రంగాలకు చెందిన వ్యక్తులతో స్నేహం నెరిపారు. ఆయన మరణం ఎంతో బాధించింది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.