దేశం మొత్తం సంపూర్ణ మూసివేత: మోదీ

ABN , First Publish Date - 2020-03-25T01:41:17+05:30 IST

ఈరోజు అర్థరాత్రి నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్ చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ సంపూర్ణ మూసివేత 21 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తప్పనిసరై ఈ

దేశం మొత్తం సంపూర్ణ మూసివేత: మోదీ

న్యూఢిల్లీ: ఈరోజు అర్థరాత్రి నుంచి దేశం మొత్తాన్ని సంపూర్ణంగా మూసివేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ సంపూర్ణ మూసివేత 21 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తప్పనిసరై ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులపై మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.


కరోనా గొలుసును తెంచాలంటే 21 రోజులు పడుతుందని అందుకే మూడు వారాల పాటు దేశంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నామని మోదీ పేర్కొన్నారు. దేశంలోని ప్రజలు ఎక్కడికీ వెళ్లవద్దని, ఏ రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోనే.. ఏ ప్రాంతంలోని వారు ఆ ప్రాంతంలోనే ఉండాలని ఆయన అన్నారు. ప్రజల సహకారం ఉంటేనే కరోనా విజయం సాధిస్తామని మోదీ అన్నారు.

Read more