8న సోషల్‌ మీడియాను మహిళలకు ఇస్తాను: మోదీ

ABN , First Publish Date - 2020-03-04T07:38:19+05:30 IST

సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటానన్న తన ప్రకటనపై ప్రధాని మోదీ మంగళవారం క్లారిటీ ఇచ్చారు. ‘‘మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం(మార్చి 8) నా సోషల్‌ మీడియా

8న సోషల్‌ మీడియాను మహిళలకు ఇస్తాను: మోదీ

న్యూఢిల్లీ, మార్చి 3: సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటానన్న తన ప్రకటనపై ప్రధాని మోదీ మంగళవారం క్లారిటీ ఇచ్చారు. ‘‘మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం(మార్చి 8) నా సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను స్ఫూర్తిదాయక మహిళలకు ఇస్తాను. మీరు అలాంటి స్ఫూర్తిదాయక మహిళా? లేదా అలాంటి మహిళలు మీకు తెలుసా? వారి కథనాలను # SheinspiresUs ద్వారా షేర్‌ చేయండి’’ అని మహిళలకు మోదీ పిలుపునిచ్చారు. దీంతో ప్రధాని మోదీ సోషల్‌ మీడియాను పూర్తిగా వదిలేస్తారన్న వదంతులకు తెరపడింది.

Updated Date - 2020-03-04T07:38:19+05:30 IST