ఇలాంటి వీడియోలు మీరూ షేర్ చేయండి: ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-03-21T22:59:15+05:30 IST

ప్రజలకు మరో సూచన చేసిన మోదీ

ఇలాంటి వీడియోలు మీరూ షేర్ చేయండి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: అవగాహన, అప్రమత్తత,  స్వీయనియంత్రణ.. కరోనా కట్టడికి ప్రస్తుతం అంబుబాటులో ఉన్న ఆయుధాలు ఇవే. కరోనా ఎలా వ్యాప్తి చెందుతుందనే దానిపై పూర్తి అవగాహన పాటించడంతో పాటూ ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలన్నీ పాటిస్తే ఈ గండం సులువుగానే గట్టెక్కచ్చు. ఈ దిశగా ప్రజలు తమ వంతు  పాత్ర పోషిస్తూ కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ పాటించి కరోనా‌ను కట్టడి చేయండని ప్రజలకు సూచించారు. మాకేం కాదులే అనే అలసత్వం వదులు కోవాలని హెచ్చిరించారు.  ఈ విషయంలో స్నేహితులకు బంధువులకు అవగాహన కల్పించాలని కోరారు.


ఇక జనతా కర్ఫ్యూకు కొద్ది గంటల సమయమే ఉన్న నేపథ్యంలో ప్రధాని ట్విటర్ ద్వారా మరో ఆసక్తి కర వీడియో చేశారు. రోజ వారీ కార్యకలాపాల ద్వారా కరోనా ఎలా వ్యాప్తి చెందుతుందో, ఎలా నిరోధించాలో తెలియజేసే వీడియో ఇది. దీనిపై వ్యాఖ్యానించిన మోదీ...‘చిన్న చిన్న జాగ్రత్తలే పెద్ద ఫలితాల్ని ఇస్తాయి. ఎన్నో ప్రాణాల్ని కాపాడుతాయి. నేను సోషల్ మీడియాలో ఈ ఆసక్తికర వీడియో చూశా. కరోనా వైరస్ కట్టడి కోసం అవగాహన పెంచే  ఇటువంటి వీడియోలు మీ వద్ద ఉంటే షేర్ చేయండి. #IndiaFightsCorona అనే హ్యష్ ట్యాగ్ జతచేయండి’ అని మోదీ ట్వీట్ చేశారు. వ్యాధి కట్టడికి అవగాహన పెంపుదించుకోవడం ఎంతో  ముఖ్యమని ఈ ట్వీట్ ద్వారా మరో మారు సూచించారు మోదీ.

Updated Date - 2020-03-21T22:59:15+05:30 IST